సినీ నటుడు నందమూరి తారకరత్నకు జీహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో తారకరత్నకు సంబంధించిన కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ను కూల్చేందుకు సోమవారం ప్రయత్నించారు అధికారులు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది అధికారులతో వాగ్వావాదానికి దిగారు. ఈ ఘటనతో రెస్టారెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెస్టారెంట్ అధికారులు విషయాన్నీ తారకరత్నకు చేరవేయడంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకుని, జీహెచ్ఎంసి అధికారులతో వాదనకు దిగారు. అయితే రాత్రి వేళల్లో మద్యం అమ్మకం, పెద్ద పెద్ద శబ్దాలతో న్యూసెన్స్ చేస్తున్నారనే సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకే తాము చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
previous post
రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డెక్కలేదు : మంచు మనోజ్