జిహెచ్ఎంసిలో అమలవుతున్న వివిధ పథకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందానికి వివరించిన కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్
తెలంగాణ రాష్ట్రానికి అలట్ అయిన 2021 బ్యాచ్ ఐ.ఎ.ఎస్ అధికారులకు శిక్షణ నిమిత్తం జిహెచ్ఎంసిలో జరుగుతున్న వివిధ పథకాల అమలు తీరును సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ వివరించారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేస్తున్న 2021 బ్యాచ్ ఐఎఎస్ అధికారులు ఈనెల 22, 23 తేదీలలో రెండు రోజులపాటు జిహెచ్ఎంసిలో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేయడానికి వచ్చారు రెండో క్షేత్ర స్థాయిలో పర్యటించి అధ్యయనం చేయనున్నారు.. ఈ నెల 22 వ తేదీన జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ సమావేశ మందిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, యు బి డి, హరితహారం, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఐటీ, రెవెన్యూ, టాక్స్, స్పోర్ట్స్, ఎస్.ఆర్.డి.పి, సి.ఆర్.ఎం.పి, టౌన్ ప్లానింగ్, టి డి ఆర్, ఎన్ఫోర్స్మెంట్, డి ఆర్ ఎఫ్ అమలు తీరును ఆయా హెచ్ ఓ డి లు వివరించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్లు లేవనెత్తిన పలు సందేహాలకు కమిషనర్ లోకేష్ కుమార్ నివృత్తి చేశారు.

ట్రైనీ ఐఎఎస్ అధికారులు రాధిక గుప్త, పి.శ్రీజ, పైజాన్ అహ్మద్, పి.గౌతమి, పర్మర్ పింకేష్ కుమార్, లలిత్ కుమార్, లెనిన్ వత్సల్ టో ప్పో, శివేంద్ర ప్రతాప్ లు పాల్గొన్నారు.
సమావేశంలో కమిషన్ తో పాటు ఈవిడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ప్రియాంక అలా, ఇంజనీర్ చీఫ్ మహమ్మద్ జియా ఉద్దీన్, అడిషనల్ కమిషనర్ వి.కృష్ణ, సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెన్నెడీ, సిసిపి దేవేందర్ రెడ్డి, సిఈ దేవానంద్, జోనల్ కమిషనర్ పంకజ, హౌసింగ్ ఓ ఎస్ డి సురేష్ కుమార్, ఎస్ సి విద్యాసాగర్, యుసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, జేసీ లు మంగతాయారు, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.


సీఎంకు అధికారాలు లేవని సీఎస్ ఎలా అంటారు: రాజేంద్రప్రసాద్