telugu navyamedia
క్రీడలు

ఫిటినెస్ పై విరాట్ కోహ్లీ దృష్టి..

సెలబ్రిటీస్ ఫిట్‌నెస్ విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకుంటారో అంద‌రికి తెలిసిందే. అయితే తాజాగా మ‌న ఇండియా సారథి విరాట్ కోహ్లీ కూడా అత్యంత ప్రాధాన్యమిస్తారన్నార‌నే దానికి ఇదే నిద‌ర్శ‌నం. 

బాడీ ఫిట్ నెస్ కోసం నిత్యం వర్కవుట్లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటారు. ఇక డైట్ విషయానికొస్తే.. తినే ఫుడ్ తో పాటు.. తాగే వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కోహ్లీ.. మినరల్ వాటర్ కు బదులు ఎక్కువగా బ్లాక్ వాటర్ ను తాగుతారు. ఆ వాటర్ లీటర్ ధర తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు.

 

Virat Kohli Black Water | Black Water Cost | Fitness Freak Virat Kohli Drinks Black Water And It's Price is Rs 4000/Litre: Report | India Captain

బ్లాక్ వాటర్ బాటిల్‌ లీటర్‌ ధర తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఎందుకంటారా.. మినరల్‌ వాటర్‌ బాటిల్‌ లీటర్‌ రూ.20-40 ఉంటే.. బ్లాక్‌ వాటర్‌ లీటర్‌ ధర రూ.3000-4000 ఉంటుందట. ఇది ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి అవుతుంది. కరోనా ప్రారంభం నుంచి బ్లాక్‌ వాటర్‌ తాగడం మొదలెట్టాడు కోహ్లీ. కేవలం కోహ్లీ మాత్రమే కాదు, బాలీవుడ్‌ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా, మలైకా అరోడా, దక్షిణాది తార శ్రుతిహాసన్‌ ఫిట్‌గా ఉండేందుకు ఇదే సేవిస్తున్నారు.

బ్లాక్‌ వాటర్ ని గుజరాత్‌లోని వడోదర లోని ఏవీ ఆర్గానిక్స్‌ అనే అంకుర సంస్థ ‘‘ ఎవోకస్‌’’ పేరుతో బ్లాక్‌వాటర్‌ తయారీని ప్రారంభించింది. బ్లాక్‌ వాటర్‌ వల్ల కలిగే ప్రయోజనాలు కూ డా ఉన్నాయి. ఈ బ్లాక్‌ వాటర్‌ వాటర్‌లో సహజసిద్ధమైన అల్కలైన్ ఉంటుంది. ఇవి మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌, ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. తద్వారా వ్యాధులు నుంచి దూరం ఉండొచ్చు.

Virat Kohli's Commitment Made Him Turn Down A Multi Crore Deal - pepNewz

ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు మీ జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం రోజూ తాగే నీరులో pH స్థాయి 7 మాత్రమే ఉంటే.. బ్లాక్‌ వాటర్‌లో 7 కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. అందుకే ఇందులో యాంటీ ఏజెంట్‌ గుణాలు ఉంటాయి. చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడ‌తాయ‌ని చెబుతున్నారు నిపుణులు.

Related posts