telugu navyamedia
క్రీడలు వార్తలు

బెంగళూరును వీడిన ఆసీస్ ఆటగాళ్లు…

నిన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ‘సూపర్’ విజయం సాధించింది. మొదటగా హైదరాబాద్‌, ఢిల్లీ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా 159 పరుగులే చేయడంతో మ్యాచ్‌లో విజేత ఎవరో తేలలేదు. దీంతో ‘సూపర్ ఓవర్’ వేసి విజేతను నిర్ణయించారు. అయితే హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తప్పిదం కారణంగానే సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలిచిందంటూ ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సూపర్ ఓవర్‌‌లో కేన్ విలియమ్సన్‌తో కలిసి బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ డేవిడ్ వార్నర్.. మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేశాడు. చివరి బంతికి వార్నర్ డబుల్ తీసినా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు లోపల వార్నర్ బ్యాట్ ఉంచలేదని తేల్చిన అంపైర్ షార్ట్ రన్ తప్పిదం కింద ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఢిల్లీ టార్గెట్ 9 పరుగుల నుంచి 8 పరుగులకి తగ్గింది. సూపర్ ఓవర్‌‌లో రషీద్ ఖాన్ మెరుగ్గా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ తడబడింది. అయితే ఆఖరి బంతికి సింగిల్ తీసి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఒకవేళ షార్ట్ రన్ పరుగు కూడా ఉండుంటే.. మ్యాచ్ మరో సూపర్ ఓవర్‌కి వెళ్లేది. అప్పుడు హైదరాబాద్ గెలిచే అవకాశం ఉండేది. జానీ బెయిర్‌స్టో లాంటి పవర్ హిట్టర్ ఉండగా.. కేన్ విలియమ్సన్‌తో కలిసి డేవిడ్ వార్నర్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వెళ్లడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Related posts