తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
అంతేకాకుండా రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేతకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలని డెసిషన్ తీసుకుంది.
రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

