telugu navyamedia
వార్తలు సామాజిక

అడుగడుగునా ఎన్నో విషయాలను మనసుకెక్కించి న మాటల మాంత్రికుడు డాక్టర్ పట్టాభిరామ్: వై మల్లికార్జున రావు

పట్టాభిరాం సర్..  ” తలరాతను తలదన్నేదే చేతిరాత”
అనే కొటేషన్ నా కోసం రాసిచ్చి, నన్నింతటి వాణ్ని చేసి తన ఆఫీసును కూడా నాకు ఇచ్చి వెళ్లిపోయారు.

ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, స్టేజ్ మీదైనా ; జీవితంలోనైనా; వాడిగా వున్నపుడు, వాడిపోయినపుడు ఎలా నిలబడాలో.. ఒక్కొక్క మెట్టు ఎలా ఎదగాలో, ఒదగాలో, .. పక్కనుండి.. చేయి పట్టుకుని.. ఒక అన్నలా నాన్నలా.. ఎన్ని విషయాలు నేర్పారు సర్..

“ప్రతిభ ఉంటే సరిపోదు – ప్రచారం కూడా కావాలి వారానికొక్కసారైనా ఏదో ఒక మాధ్యమంలో కనబడుతూనే ఉండాలి. లేకపోతే ప్రజలు మర్చిపోతారు.”

“ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి.. లేకపోతే మనకి అవకాశాలు రావు”

” అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం చాలా చోట్లకి తిరుగుతున్నారు జాగ్రత్తగా ఉండండి”

” ఎప్పుడూ డబ్బు కోసం, పేరు కోసం పనిచేయకండి; అవి సక్సెస్ యొక్క బై ప్రొడక్ట్స్. మీకు ఇష్టం కాబట్టి అందులో ఇన్వాల్వ్ అయి పని చేయండి.

డబ్బు, పేరు వాటంతట అవే వస్తాయి” ఇలా ఒకట, రెండా అడుగడుగునా ఎన్నో విషయాలను మనసుకెక్కించి ఆ మాటల మాంత్రికుడు వెళ్లిపోయారు.

రచయత: వై మల్లికార్జున రావు

 

Related posts