డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లాక్‌డౌన్ వేళ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ జనానికి తెలియని చాల విషయాలను తెలియజేస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర విషయం పంచుకున్నారు. ”నేను ఎవరిని? ఎక్కడ్నుంచి వచ్చానని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మీలో ఉంటే.. మీకో గుడ్ న్యూస్ చెప్తా. నేషనల్ జాగ్రఫీ ఛానెల్ వారు జీ నాన్సి అనే ఓ టెస్ట్ చేస్తున్నారు. మనం డబ్బులు కడితే వాళ్ళు ఓ కిట్ పంపిస్తారు. అందులో ఓ ఇయర్ బడ్ లాంటిది ఉంటుంది. దాంట్లో మీ సలైవా నింపి వాళ్లకు పంపిస్తే వాళ్లు డీఎన్‌ఏ టెస్ట్ చేస్తారు. దీని ద్వారా మీ పూర్వీకులెవరో తెలుసుకోవచ్చు. అలాగే మీ లోని డిసీజ్‌లు అల్జీమర్స్, పార్కిన్‌సెస్ లాంటి వాటికి కారణాలు కూడా తెలుసుకోవచ్చు. వాళ్ల దగ్గర డీఎన్‌ఏ రిలేటివ్స్ టూల్ అని ఒకటుంటుంది. దాన్నిబట్టి మీ పూర్వీకులు ఎవరు? అని తెలుసుకోవచ్చు. అబ్రహం లింకన్ మీకు చుట్టం కావచ్చు. క్లియోపాత్ర మీ అక్క కావచ్చు. చెంగిజ్‌ఖాన్ రక్తం మీలో ఇంకా ఉండొచ్చు. అందులో రీజనల్ అంటే లాస్ట్ 500 ఇయర్స్‌లో మీ రెలేటివ్స్ ఎవరు? ఇంకా లోతుగా వెళ్తే వలసవాదులుగా మన పూర్వీకులు ఎక్కడెక్కడి నుండి వచ్చారు. ఇలా వాళ్లు మనకు సంబంధించి 74 రిపోర్ట్స్ ఇస్తారు. ఈ టెస్ట్ పేరు జీన్ 2.0. ఈ టెస్ట్ ఖరీదు 150 డాలర్లుంటుంది. నేను నా టెస్ట్ చేయించుకున్నా. నాకు చాలా విషయాలు తెలిశాయి. మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ చేయించుకోండి. గూగుల్ చేయండి సమాచారం దొరుకుతుంది” అని చెప్పారు పూరి జగన్నాథ్.
previous post