టీడీపీ చేపట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమంపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కొందరు నేతలు తిడుతున్నా పోలీసులు ఎంతో ఓర్పుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఛలో ఆత్మకూరు సందర్భంగా పోలీసులు స్పందించిన తీరు అభినందనీయం అని ప్రశంసించారు.
వైన్ వెల్ఫేర్ భవనంలో ఉన్నవారందరినీ స్వయంగా పోలీసులే గ్రామానికి తీసుకెళ్లారని ఆయన వివరించారు. గణేశ్ నిమజ్జనాలు ముగిసేవరకు పల్నాడులో 144 సెక్షన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆత్మకూరులో జరిగింది రెండు వర్గాల మధ్య ఘర్షణ తప్ప పార్టీలకు సంబంధంలేదని అన్నారు. కొందరు నేతలు పోలీసులతో అసభ్యంగా మాట్లాడినట్టు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు.


జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది: అయ్యన్నపాత్రుడు