telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రొ కబడ్డీ లీగ్‌ : .. ఫైనల్లో .. ఢిల్లీ, బెంగాల్‌ టీమ్స్..

delhi and bangalore in finals of pro kabaddi

పీకేఎల్‌ ఏడో సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ, బెంగాల్‌ వారియర్స్‌ ఫైనల్లోకి ప్రవేశించాయి. సెమీఫైనల్లో ఢిల్లీ జట్టు 44-38తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌కు షాకిచి్చంది. ఈ మ్యాచ్‌లో దబంగ్‌ టీమ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. రైడర్లలో నవీన్‌ 15, చంద్రన్‌ రంజీత్‌ 9 పాయింట్లు సాధించారు. డిఫెండర్‌ అనిల్‌ 4 పాయింట్లు చేశాడు. మిగతా వారిలో విజయ్, రవీందర్, జోగిందర్‌ తలా 3 పాయింట్లు తెచ్చిపెట్టారు.

బెంగళూరు తరఫున పవన్‌ షెరావత్‌ (18) చక్కని పోరాటపటిమ కనబరిచాడు. రెండో సెమీస్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 37-35తో యు ముంబాపై నెగ్గింది. వారియర్స్‌ తరఫున సుకేశ్‌ (8), నబీబ„Š (5), ప్రపంజన్‌ (4) రాణించారు. యు ముంబా జట్టులో అభిõÙక్‌ 11 పాయింట్లు సాధించాడు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం శనివారం ఢిల్లీ, బెంగాల్‌ జట్ల మధ్య ఇక్కడే టైటిల్‌ పోరు జరగనుంది.

Related posts