telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో కర్ఫ్యూ… మొదటి రోజు కావడంతో…?

siricilla collector lockdown

ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు జరుగుతుంది.  మధ్యాహ్నం 12 గంటల తరువాత షాపులు బంద్ చేశారు.  12 గంటల తరువాత షాపులను వ్యాపారాలు స్వచ్చందంగా మూసివేయగా, రోడ్డుపైకి వచ్చిన ప్రజలకు చెప్పి వెనక్కి పంపుతున్నారు.  అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను కూడా తిరిగి వెనక్కి పంపుతున్నారు.  ఈరోజు వరకు ప్రజల్లో అవగాహనా కల్పిస్తామని, రేపటి నుంచి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తామని చెప్తున్నారు పోలీసులు.  మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.  రాత్రి సమయంలో నైట్ కర్ఫ్యూ, ఉదయం సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుంది.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉండటం విశేషం.  మొత్తం మీద 18 గంటలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts