telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న సీపీఐ శ్రేణులపై కేసులను ఎత్తివేయండి మంత్రి లోకేష్‌కు సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ళ వినతి

రాష్ట్రంలో వివిధ ప్రజా సమస్యలపై నిర్వహించిన ఉద్యమాల సందర్భంగా గత కాలంలో సీపీఐ, అనుబంధ ప్రజాసంఘాల శ్రేణులపై నమోదైన కేసులను తొలగించాలని రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ను శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావులు కోరారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సీపీఐ, అనుబంధ సంఘాల శ్రేణులపై నమోదైన కేసుల వివరాలతో కూడిన జాబితాను మంత్రికి అందజేశారు.

దీనిపై మంత్రి లోకేష్‌ సానుకూలంగా స్పందిస్తూ తప్పనిసరిగా వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీపీఐ నేతలకు హామీ ఇచ్చారు.

Related posts