తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేయనుంది. ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుబడితో పంటలు సాగు చేసి దిగుబడిరాక ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.2019-20 ఏడాదిలో ఆత్మహత్య చేసుకున్న 243 రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 6 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రూ. 14.58 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల జారీతో 24 జిల్లాలకు చెందిన రైతు కుటుంబాలకు పరిహారం అందనుంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 45 రైతు కుటుంబాలకు పరిహారం అందనుంది.
సచివాలయాన్ని కూలగొట్టించడానికి కేసీఆర్ సిద్దమయ్యారు: రేవంత్ రెడ్డి