telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆక్సిజన్ ఫ్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను ప్రారంభించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించి జాతికి అంకిం చేశారు.

ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ. ..ప్రతి యాభై పడకల ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశామని.. మరో 71 చోట్ల ప్రైయివేటు ఆస్పత్రుల్లో కూడా 71 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించామన్నారు.

100 పడకలు ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. ఒక్కో ప్లాంట్‌లో నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అదేవిధంగా కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సేకండ్ వేవ్‌లో ఆక్సిజన్‌ విమానాల్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఇప్పుడు మనమే సొంతంగా ఆక్సిజన్‌ సరఫలా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రూ.20కోట్ల వ్యయంతో ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ ఐఎస్‌ఓ కంటైనర్లు కొనుగోలు చేశామన్నారు. విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశామన్నారు. 163 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు 20 పడకల పీడియాట్రిక్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.

Related posts