telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో బూస్ట‌ర్ డోస్ వ్యాక్సినేష‌న్ పంపిణీ..

తెలంగాణలో బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. చార్మినా ర్‌లోని యునాని ఆసుపత్రిలో బూస్టర్ డోస్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభమైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌లు వేసేందుకు సిద్ధమైంది.

Booster doses for senior citizens launched in Telangana

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూస్టర్ డోస్‌‌పై అనుమానాలొద్దని .. బూస్టర్ డోస్‌తో ప్రయోజనాలు ఉన్నాయని.. అర్హులైన అందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కోరారు. అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారని అన్నారు..

వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ ముందజలో ఉందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్క్, వ్యాక్సిన్ తప్పనిసరి అని అన్నారు.

గతంలో తీసుకున్న టేకానే తిరిగి మూడో డోస్‌గా ఇవ్వనున్నట్టు తెలిపారు. గతంలో చేసుకున్న టీకా రిజిస్ట్రేషన్ ఆధారంగా కోవిన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదన్న వైద్యారోగ్యశాఖ.. నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకునే సదుపాయాన్ని కల్పించింది.

Booster doses for senior citizens launched in Telangana

బూస్టర్‌ డోస్‌ను ఫ్రంట్ లైన్ వర్కర్లైన హెల్త్, పోలీసు సిబ్బందికి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 6.60 లక్షల ఫ్రంట్ లైన్ వర్కర్లను గుర్తించామని.. వారికి బూస్టర్‌ డోసు ఇవ్వ‌డం జ‌రుగుతుంది అన్నారు.

యునానీ ఆస్పత్రిలో సమస్యలపై చర్చించామని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని మంత్రి హరీష్ తెలిపారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటుగా ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ బలాలా, ముంతాజ్ అహ్మద్ ఖాన్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం మాస్క్, సానిటైజర్ లతో పాటూ వాక్సిన్ తీసుకోవాలన్నారు. వాక్సిన్ పై అపోహలు నమ్మొద్దని, అర్హులందరూ వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. యునాని ఆస్పత్రి చాలా పాతది అయిపోయిందని, వర్షం పడితే ఇబ్బందిగా ఉందని, యునాని ఆస్పత్రిలోని సమస్యలను మంత్రి హరీష్‌రావుకు వివరించానన్నారు.

Related posts