ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజువేడుకలు నిరాడంబరంగా జరిగాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు చేరుకుని పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులచేత ఆశీర్వచనాలు అందించారు. ఆత్మీయుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
పంచాయతిరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని నాని, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆబ్కారీశాఖ మంత్రి నారాయణస్వామి తదితరులు ముఖ్యంమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.