సాంకేతికపరంగా ఎంత అభివృద్ది సాధించినా, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు బలంగా పాతుకొని ఉన్నాయి. తాజాగా సూర్యగ్రహణం సందర్భంగా కర్ణాటకలో జరిగిన ఘటననే దీనికి నిదర్శనం. సూర్యగ్రహణం రోజున పిల్లలను మట్టిలో పాతిపెడితే వారికున్న అంగవైకల్యం పోతుందన్న నమ్మకంతో గొయ్యి తీసి తల్లిదండ్రులు పిల్లలను పాతిపెట్టారు.
ఈ ఘటన ఉత్తర కర్ణాటకలోని తాజ్‌సుల్తాన్‌పురాలో చోటు చేసుకుంది. పిల్లలు రోదిస్తున్నప్పటికీ గ్రహణం ముగిసే వరకు పిల్లలను వారి తల వరకు మట్టిలోనే కప్పి ఉంచారు. ఈ విషయం స్థానిక అధికారులకు తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు.
.


ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ చురకలు