telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రాణహాని ఉంది..హైకోర్టును ఆశ్ర‌యించిన చికోటీ ప్ర‌వీణ్‌..

*న‌న్ను చంప‌డానికి కుట్ర జ‌రుగుతుంది..
*హైకోర్టును ఆశ్ర‌యించిన చికోటీ ప్ర‌వీణ్‌..
*ప్రాణహాని ఉంది.. 2+2 గన్‎మెన్‎లను రక్షణ కల్పించాలని కోరుతూ పిటిష‌న్‌

తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరుతూ చీకోటి ప్రవీణ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2+2 గన్‎మెన్‎ల రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. తన ఇంటి ముందు ఇటీవల కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడాన్ని తన అనుచరులు గుర్తించారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇదే విషయంపై ఇప్ప‌టికే చీకోటి ప్రవీణ్ న్యాయవాది సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీకోటి ప్రవీణ్ ను చంపేందుకు తెర వెనుక కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని చీకోటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Related posts