telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పలనాడు-మాచర్ల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం

పలనాడు-మాచర్ల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.

పలనాడు జిల్లాలో తలసరి ఆదాయం తక్కువ ఉంది. అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల, గురజాలను అభివృద్ధి చేస్తాం.

జల్ జీవన్ మిషన్ ద్వారా మూడేళ్లలో ఇంటింటికీ కుళాయితో తాగునీరు అందిస్తాం.

పలనాడు జీవనాడి వరికెపుడిశెల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటాం.

1.25 లక్ష ఎకరాలకు నీరు అందుతుంది. మరో లక్ష మందికి తాగునీరు అందిస్తాం.

మొదటి దశలో 1.45 టీఎంసీలు, రెండో దశలో 6.3 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టు పూర్తి చేస్తాం.

రాష్ట్రానికి వరం పోలవరం. గతంలో మేం 76 శాతం పూర్తి చేస్తే ఐదేళ్లలో ఒక వ్యక్తి వచ్చి విధ్వంసం చేశాడు.

ప్రజావేదికతో విధ్వంసం మొదలు పెట్టి పోలవరంలో డయాఫ్రాం వాల్ కొట్టుకుపోయేలా చేశాడు.

కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం పునర్నిర్మాణం చేపట్టాం. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.

శ్రీకాకుళంలో ఉన్న వంశధారను, గోదావరి, కృష్ణా, రాయలసీమలో పెన్నా నదిని అనుసంధానిస్తాం.

ఇప్పటికే గోదావరి కృష్ణా నదిని అనుసంధానించాం. త్వరలోనే గోదావరి వంశధారను అనుసంధానిస్తాం తర్వాత పెన్నాను కూడా కలుపుతాం.

కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ వల్ల ఈ ఏడాది 94 శాతం రిజర్వాయర్లు నిండాయి.

రైతుల కోరిక మేరకు మిర్చి బోర్డును ఈ ప్రాంతానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్ని్స్తాం.

యూరియా వేసి మిర్చి పండించొద్దు. ఇప్పుడు టెస్టింగ్ ట్రేసింగ్ వచ్చేసింది. పరీక్షించాకే కొనుగోలు చేస్తున్నారు.

పంట ఎక్కువ వస్తుందని యూరియా వేస్తే అనర్థాలు కూడా వస్తాయి.

మనిషి ఆరోగ్యానికి పౌష్టికాహారం లాగే భూమికి న్యూట్రియెంట్స్ కావాలి.

భూమికి కూడా యూరియా అనే స్టిరాయిడ్స్ ఇస్తున్నాం.

మన పంటల టెస్ట్ చేసి కొంటున్నారు. రెసిడ్యూ ఉంటే తిరస్కరిస్తున్నారు లేదా ధర ఇవ్వటం లేదు.

మాచర్ల మున్సిపాలిటికీ అదనంగా రూ. 50 కోట్లు ఇస్తాం.

మాచర్లకు వంద పడకల ఆస్పత్రిని కూడా మంజూరు చేస్తాం.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికీ 100 పడకల ఆస్పత్రులు కట్టాలని ఆలోచన చేస్తున్నాం.

కారంపూడి- పలనాటి వీరారాధన ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాం.

రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ పారిశ్రామిక వేత్తను తయారు చేయాలనే సంకల్పం చేశాం.

జన్మభూమి పిలుస్తోంది రా అంటే ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున కదలి వచ్చారు.

పేదరికంలో ఉన్న కుటుంబాలను పైకి తీసుకురావాలన్న ఆశయంతోనే పీ4 కార్యక్రమం చేపట్టాం అని చంద్రబాబు అన్నారు.

Related posts