ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది.
సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం అజెండాగా రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగనుంది.
జీఎస్డీపీ లక్ష్యాలు, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు, సుస్థిరాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
కేంద్ర నిధులను వివిధ ప్రభుత్వ శాఖలు ఏ విధంగా వినియోగించారు యూసీలను ఏ మేరకు జారీ చేశాయనే అంశాలపై సమీక్ష జరుపనున్నారు.
సూపర్ సిక్స్ పథకాల అమలు, ఇ-ఆఫీస్, డేటా డ్రైవెన్ గవర్నెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం సమీక్ష చేయనున్నారు.
క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. ఇక ఈ కలెక్టర్ల సదస్సులో సీఎస్ కె.విజయానంద్ ప్రారంభోపన్యాసం చేశారు.
పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. మొంథా సైక్లోన్ సమయంలో వేగంగా స్పందించిన జిల్లా కలెక్టర్లందరికీ అభినందనలు తెలియజేశారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని తెలిపారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు హాజరయ్యారు.


జగన్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలి: స్వామి శ్రీనివాసానంద