ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 10వ తేదీన శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోని కొత్తచెరువుకు రానున్నారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తచెరువులో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ తెలిపింది.
ఈ కార్యక్రమాన్ని కొత్తచెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ చేతన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా విద్యా శాఖ అధికారి కిష్టప్ప, మండల విద్యాశాఖ అధికారి జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (మెగా PTM)గా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించబడుతున్న ఒక కార్యక్రమం.

