telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఐఐ వార్షిక సమ్మేళనంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు

దావోస్‌లో ఏటా పారిశ్రామిక వేత్తల సదస్సు జరుగుతుంది దావోస్ వెళ్లవద్దని కొందరు సూచించారు దావోస్ సదస్సుకు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు వస్తారని చెప్పారు.

ప్రముఖులతో సంబంధాల దృష్ట్యా పేదలు మీకు ఓట్లు వేయరని చెప్పారు. ఆ సమయంలో కేంద్ర నాయకులు, ప్రధాని కూడా దావోస్ వెళ్లలేదు.

1995 నుంచి నేను మాత్రమే దావోస్ తరచూ వెళ్తున్నాను. సంపద సృష్టి జరగాలి అది పారిశ్రామికవేత్తల ద్వారా సాధ్యం.  సంపద సృష్టి ద్వారానే ఆదాయం పెరుగుతుంది.

ఆదాయం పెరిగితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు. సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేము.

గతంలో నేను ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు సీఐఐ సదస్సులు నిర్వహించాను.

నేను మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చాను.  పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయి 1990లలో ఇంటర్నెట్ విప్లవం వచ్చింది.

ఇంటర్నెట్ విప్లవాన్ని ముందుగా అందుకున్న వాళ్లలో నేను ఒకడిని ప్రస్తుతం భారత్‌కు జనాభా అనుకూలత ఉంది.

డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చింది.

ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా చాలామంది నాయకులను చూశాను. సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ప్రధానిగా ఉన్నారు.

మోదీ నాయకత్వం దేశానికి ఓ ప్రధాన బలం చైనా ఆర్థిక వ్యవస్థ ఇండియాకు నాలుగున్నర రెట్లు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇండియాకు ఏడు రెట్లు.  సరైన పబ్లిక్ పాలసీలు రూపొందించుకుంటే ఇండియా ప్రగతిని ఎవరూ ఆపలేరు.

వచ్చే పదేళ్లు చాలా కీలకమైన సమయం హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ నేను గతంలో హైదరాబాద్ ను చాలా ప్రమోట్ చేశాను.

హైదరాబాద్ వల్లే తెలంగాణ దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా మారింది ఐటీ పరిశ్రమలు తీసుకురావడం వల్ల లబ్ధి జరుగుతోంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో ఎక్కువగా భారతీయులు ఉంటున్నారు.

భారతీయుల్లో 30 శాతం తెలుగు సిబ్బంది ఉంటున్నారు ప్రపంచ దేశాలు చాలా వరకు తిరోగమనంలో ఉన్నాయి.  2047 విజన్ లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది.

వందల ఏళ్ల వరకు ప్రపంచానికి భారత్ సేవలందించగలదు సాంకేతిక విప్లవంలో భాగంగా అనేక మార్పులు వచ్చాయి.  15 శాతం వృద్ధిరేటు సాధించాలన్నది నా లక్ష్యం.

గతంలో ఐటీని ప్రమోట్ చేశారు ఇప్పుడు క్వాంటం టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నారు .

అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాను. విశాఖలో టీసీఎస్ మొదలవుతోంది ఆర్సెల్లార్ మిట్టల్ పరిశ్రమ ప్రారంభంకాబోతోంది విశాఖకు గూగుల్ రాబోతోంది , ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయి.

సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉంది గ్రీన్ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి.

ఏడాదిలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నాం ఈ ప్రాజెక్టుల ద్వారా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయి.

మైనింగ్, టూరిజంలోనూ ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయి రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటవుతోంది – 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకావాలనేది నా లక్ష్యం.

ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలనేది నా లక్ష్యం నేను గతంలో పీపీపీ పద్ధతిని ప్రమోట్ చేశా అప్పట్లో మొదటి విద్యుత్ పరిశ్రమ జేగురుపాడులో వచ్చింది.

పీపీపీ పద్దతిలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయి ఆర్థిక సంస్కరణల కారణంగా ఆర్థిక అంతరాలు కూడా పెరిగాయి.

ఆర్థిక అంతరాలను రూపుమాపేందుకు పీ4 విధానం తీసుకొచ్చాం సరైన సమయంలో సరైన సాయం చేస్తే కొన్ని జీవితాలు మారిపోతాయి .

సమాజంలోని టాప్ 10 శాతం మంది అట్టడుగున ఉన్న 10 శాతాన్ని దత్తత తీసుకోవాలి.

కేవలం డబ్బుతోనే అన్ని పనులు జరగవు సరైన మెంటార్‌షిప్ ఇవ్వడం కూడా ఒక మంచిసాయం ప్రపంచం మొత్తానికి సేవలు అందించే నాయకులను తయారు చేయాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.

Related posts