telugu navyamedia
వార్తలు

కాల్పుల విరమణ బోల్తా: మళ్లీ ముదిరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్దం మళ్లీ మొదటికి వచ్చింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన గంటలలోపే సీన్ రివర్స్ అయింది.

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన కాసేటికే మళ్లీ.. కాల్పులకు సై అంటూ దిగడం.. ఆ రకంగా ప్రకటనలు చేయడం కలకలం రేపుతోంది.. కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇరాన్‌ దాడులకు దిగింది.

ఇజ్రాయెల్‌ లోని పలు నగరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులకు పాల్పడిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఇరాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆరోపించింది.

దీంతో ఇరాన్‌పై మరిన్ని భీకరదాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ రక్షణశాఖ ప్రకటించింది. బీర్‌షెవాలోని ఓ బిల్డింగ్‌ మిస్సైల్‌ దాడిలో కుప్పకూలింది.

9 మంది ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌ దాడిలో బీర్‌షెవాలో మూడు భవనాలు ధ్వంసమయ్యాయయని ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించారు.

ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగే వరకు దాడులు చేస్తామని ప్రకటించారు. ఇరాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘించిందన్న ఇజ్రాయెల్.. ఇరాన్‌పై భీకరదాడులు చేయాలని IDFకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది.

Related posts