telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు

maoist naksals

ఇద్దరు ఏసీఎంలు, దళ సభ్యురాలతో సహా నలుగురు మిలీషియా సభ్యులు మొత్తం ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయినట్టు విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు, జిల్లా ఎస్పీ బాబూజీ తెలిపారు. అనారోగ్య సమస్యతోపాటు, పార్టీ సిద్ధాంతాలు నచ్చక బయటికి వచ్చానని లొంగిపోయిన మావోలు చెప్పారు.

లొంగిపోయిన వారిలో ఇద్దరు ఏసీఎంలపై రూ.4 లక్షలు చొప్పున రివార్డు ఉందని చెప్పారు. ఏసీఎంలు లింబోపై 17 కేసులు, జానకిపై 9 కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టు దళ సభ్యురాలు కిల్లోరెల్లీ అలియాస్ దుర్గపై 12 కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరంతా జనజీవన శ్రవంతిలోకి రావడం శుభపరిణామం అని డీఐజీ, ఎస్పీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం తరఫున ఏ రివార్డులు ఉన్నాయో అన్నీ అందిస్తామన్నారు.

Related posts