విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. అలాగే దీక్షల విరమణకు కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఈరోజు, రేపు వీఐపీ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితేఈ రోజు, రేపు సాధారణ దర్శనాలను మాత్రమే అనుమతి ఉంటుందని, భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించమని కలెక్టర్ తెలిపారు.


దొంగలెక్కల వీసారెడ్డి స్కూల్లో.. సజ్జల శిక్షణ పొందినట్లున్నారు: అనురాధ