telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పిల్లల్ని ఎప్పుడు కనాలన్నది నా వ్యక్తిగతం : అనుష్క శర్మ

Anushka-Sharma

కొహ్లీ, అనుష్క ప్రేమించుకుని వివాహంతో ఒకటి అయ్యారు. సినిమాలతో పాటు వ్యాపారాల్లో బిజీబిజీగా ఉండే అనుష్కకి ఇటీవలి కాలంలో కాస్త విరామాన్ని తీసుకోవాలనుకుంటోందట. అయితే పిల్లల్ని కనడానికే అనుష్క బ్రేక్ తీసుకుంటోందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా ఇటీవల ఆమె హాట్ కామెంట్స్ చేసింది. ‘నేను డబ్బులను సంపాదించడానికి సినిమాల్లోకి రాలేదు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పుడే కాదు.. మొదటి నుంచీ నేను డబ్బుల కోసం సినిమాలు చేయలేదు. ఇప్పుడు డబ్బులు కోసమని వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోవల్సిన అవసరం లేదు. నాకు సినిమాలతో పాటు చాలా పనులున్నాయి. నచ్చిన కథ దొరికితే నేను నటించడమే కాదు నిర్మించడానికి కూడా నేను సిద్ధం. అలాగే నేను తల్లిని కావడానికే విరామం తీసుకున్నానని చాలా వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. అయినా పిల్లల్ని ఎప్పుడు కనాలన్నది నా వ్యక్తిగతం అంటూ ఘాటుగా స్పందించింది అనుష్క శర్మ.

Related posts