లాక్డౌన్ కారణంగా పనులు దొరకక బిక్కుబిక్కుమంటున్న సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేయడం, ముఖ్యమంత్రి సహాయ నిధికి అలాగే ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టారు సినీ ప్రముఖులు. అయితే ఈ లాక్డౌన్ సమయంలో సేవలు చేసిన ప్రముఖుల పనితీరుపై ఓ సర్వే నిర్వహించింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బీ). ఈ సర్వేలో బాలీవుడ్ స్టార్ హీరోలను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు సోనూసూద్. ఆ తర్వాతి స్థానాల్లో అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ ఉండటం గమనార్హం. దీంతో సోనూసూద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల విషయంలో ఆయన చూపిన తెగువ దేశ ప్రజలందరి మన్ననలు పొందింది. సొంత వాహనాలు పెట్టి సుమారు 30,000 పైచిలుకు వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేర్చారు సోనూసూద్. ఇప్పటికీ ఆయన తన సర్వీస్‌ను కొనసాగిస్తూనే ఉండటం విశేషం. ఇదే సర్వీస్ ఆయన్ను రియల్ హీరో చేసి పలువురి చేత ప్రశంసలు కురిపిస్తోంది.
							previous post
						
						
					
							next post
						
						
					

