కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తొలివారం నుంచే ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి బిగ్ బాస్ సీజన్ 5 మొదలై ఏడు రోజులు కావొస్తుంది. 19మంది కంటెస్టెంట్ల్ లు హౌస్‌లో కావాల్సినంత వినోదం పంచుతున్నారు. గత సీజన్స్‌లానే ఇంటిసభ్యుల మధ్య గొడవలు, అరుపులు, ఏడుపులు, నవ్వులు ఇలా సందడిగా బిగ్ బాస్ సాగుతుంది.

ఇక తొలి వారం ఫస్ట్ ఎలిమినేషన్ కు టైం దగ్గర పడింది. నేడు (ఆదివారం ఎపిసోడ్) నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు ప్రకటించనున్నారు. దీనితో ఉత్కంఠ పెరుగుతోంది.
మొదటి సీజన్ 5 కెప్టెన్ గా సిరి హనుమంత్ ఎంపిక అయ్యింది. ఇంటి సభ్యులు లవ్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకోవడంలో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. శనివారం నాగార్జున రాకతో ఎపిసోడ్ మొత్తం సందడి సందడిగా సాగింది. సింగర్ శ్రీరామ్ రాముడా ? కృష్ణుడా ?, షణ్ముఖ్ పై నాగ్ ఫన్నీ కామెంట్స్.. కొంచెం మాట్లడారా? కొంచెం కనిపించురా? ‘ఎవరితో సెట్… ఎవరితో కట్’ గేమ్ వంటివి నిన్నటి ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ వీక్ నామినేషనలలో ఆరుగురు సభ్యులలో యాంకర్ రవి, హమీదాలు శనివారం నాటి ఎపిసోడ్‌లో సేవ్ అయ్యారు. ఇక మిగిలింది మానస్, సరయు, కాజల్, జెస్సీలు ఈ నలుగురిలో ఒకరు ఈ వారం బయటకు వెళ్లనున్నారు. వీరిలో ప్రేక్షకుల ఓటింగ్ బట్టి ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది.

అయితే ఈ ఓటింగ్‌లో సరయు జేసీల మధ్య పోటీ జరిగిందని తెలుస్తుంది. అయితే నలుగురిలో కాజల్, మానస్‌ను సేవ్ చేసి జేసీ సరయూల్లో ఒకరు ఎలిమినేటి అవ్వనున్నారని తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎలిమినేషన్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉండనుందట. అంతా జేసీ ఎలిమినేటి అవుతాడేమో అనుకున్నా అనూహ్యంగా సరయు ఎలిమినేటి అవుతుందని అంటున్నారు. మొదటి వారం ఎలిమినేషన్ అయ్యేది సరయూనే అని అంటున్నారు. అయితే ఆనీ మాస్టర్ విషయంలో జేసీ చేసిన రచ్చ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. జేసీ నామినేషన్ లో ఉన్న సమయంలో ఖచ్చితంగా అతడే ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు.

జేసీ జైలుకు వెళ్లడంతో ప్రేక్షకుల్లో సింపథీ ఓట్లు పెరిగాయని తెలుస్తుంది. దాంతో సరయు ఇంటి నుంచి బయటకు వెళ్ళాక తప్పదంటున్నారు. సరయు మొదటినుంచి హౌస్ లో చాలా హుషారుగా ఉంటూ ఆకట్టుకుంది. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున ఆమెను అడిగిమరీ బూతులు తిట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ టైంలో సరయు ఎలిమినేషన్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అయితే ఈ రోజు జరిగే ఎపిసోడ్‌లో మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.



ఆ బాలీవుడ్ సినిమా చేసినందుకు బాధ పడడం లేదు : పూజాహెగ్డే