telugu navyamedia
క్రైమ్ వార్తలు

గణేశ్‌ మండపం వద్ద నృత్యం చేస్తూ యువకుడి మృతి

అనంతపురం జిల్లా గుత్తి స్వీపర్స్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. పెద్ద కుళ్లాయప్ప అనే యువకుడు గణేష్‌ విగ్రహం ఎదుట హుషారుగా డాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. నృత్యం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతోనే యువకుడు చనిపోయాడని వైద్యులు భావిస్తున్నారు.

అప్పటి దాకా సరదగా డాన్స్‌ వేస్తూ అంతలోనే ఊహించని విధంగా స్నేహితుడు మృతి చెందడంతో స్నేహితులు షాక్‌కు గురయ్యారు. పెద్ద కుళ్లాయప్ప అనే యువకుడు గణేష్‌ విగ్రహం ఎదుట హుషారుగా డాన్స్‌ వేస్తూ అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి కింద పడిపోయాడు.

Related posts