telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ నటుడిపై ఆగంతకుల కాల్పులు… మృతి

Mithilesh

బీహార్‌లోని సమస్తీ‌పూర్ జిల్లాలో కొందరు దుండగులు భోజ్‌పురి నటుడు మిథిలేష్ పాశ్వాన్ ను తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన ముఫ్ఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నటుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే భోజ్‌పురి నటుడు మిథిలేష్ పాశ్వాన్ తన వాహనంపై ఆధార్‌పూర్ గ్రామానికి వెళుతున్నారు. అక్కడి ఖాదీ భండార్‌కు చేరుకోగానే, బైక్‌పై వచ్చిన దుండగులు… మిథిలేష్ వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తూ ఆపారు. తరువాత వారు మిథిలేష్‌తో కొంతసేపు మాట్లాడారు. ఇంతలో వారిలోని ఒకడు ఉన్నట్టుండి మిథిలేష్‌పై కాల్పులు జరిపాడు. దీంతో మిథిలేష్ కిందపడిపోయాడు. తరువాత ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మిథిలేష్‌ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ మిథిలేష్ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts