telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పోలింగ్ బూత్ లో .. ఫుటేజీని బయటపెట్టాలి : కోడెల

AP Assembly sessions January 30 Speaker Kodela

ఏపీ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఇనిమెట్ల ఘటనలో తనపై కేసు పెట్టినందుకు తన కేమీ బాధ లేదని అన్నారు. గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘నా మీద కేసు పెట్టినందుకు నా కేమీ బాధ లేదు. చట్టప్రకారం కంప్లయింట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేస్తారు. చెయ్యనివ్వండి. నిజాలు తేలాలి. పోలింగ్ బూత్ లో ఉన్న ఫుటేజ్ ను బయటకు తీయండి.

తనపై దాడి పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని కోడెల శివప్రసాద్ అన్నారు. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబే ఈ దాడికి సూత్రధారి అని ఆరోపించారు. ఆయన తనపై దాడి చేసి రాష్ట్రమంతటా భయాందోళనలు సృష్టించాలని వైసీపీ నేతలు భావించారన్నారు. ఆ తర్వాత తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అనుకున్నారని అన్నారు. ప్రధాని మోదీ కూడా చంద్రబాబును ఓడించాలని చూశారని, వ్యవస్థలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తమకు ఏం కావాలో ఇక్కడి ప్రజలకు తెలుసని, అందుకనే జనం టీడీపీకి ఓటేశారని అన్నారు.

దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కక్షతో ఉండం, చట్టంతో పని చేస్తాం. ఎందుకంటే, ఇలాంటి దౌర్జన్యాలకు అనుమతిస్తే, రాష్ట్రం మళ్లీ రావణకాష్టం అవుతుంది. అది అరికట్టాలంటే, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. ‘అభివృద్ధి, శాంతి’ తన నినాదం అని, ఐదేళ్ల పాటు నరసరావుపేట, సత్తెనపల్లిలో అక్రమాలు జరగకుండా చూశానని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని, మహిళలు, పింఛన్ల లబ్ధిదారులు టీడీపీ వెంటే ఉన్నారని, టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Related posts