telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త అవతారం

Bellamkonda

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల “రాక్షసుడు” సినిమాతో ఘనవిజయం అందుకున్న అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ హీరో `కందిరీగ`, `రభస` సినిమాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ ఎయిట్ ప్యాక్‌లో సరికొత్తగా కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమవుతుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది. 

Related posts