కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరికి వారు ఇంటికే పరిమితమయ్యారు ఈ విరామ సమయాన్ని తమ కుటంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న సెలబ్రిటీలంతా కూడా ఇంట్లో తమ రోజు వారీ పనులను ఫోటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ప్రజలు సామాజిక దూరం పాటించాలంటూ తన పాట ద్వారా సోషల్ మీడియాలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కరోనా వ్యాప్తిని ఎలా అరికట్టాలో పాటించాల్సిన విధానాన్ని స్టెప్ బై స్టెప్ వివరిస్తున్న పాటను సోషల్ మీడియాలో శుక్రవారం షేర్ చేశారు.


సినిమా తీసిన ప్రతి హీరోతో గొడవే..పీవీపీపై బండ్ల గణేశ్ ట్వీట్