తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పసుపు రైతులు మహాధర్నా చేపట్టనున్నారు. ఏపీ పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 2న దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు లాం ఫాంలో మేలు రకమైన విత్తనాలను తయారుచేసి 50 శాతం సబ్సిడితో అందించాలని, పసుపు ప్రాసెసింగ్ యంత్రాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని అన్నారు. దుగ్గిరాల కేంద్రంగా రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పసుపు పంటను నిల్వ చేసుకునేందుకు గోదాముల్లో 90 శాతం రాయితీ సౌకర్యాన్ని కల్పించాలని తదితర డిమాండ్ల సాధన కోసం మహాధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
r