సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలోని విద్యార్థులకు బోర్డు కీలకమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది.
ఇకపై వార్షిక పరీక్షలకు హాజరు కావాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు తీసుకున్న తాజా నిర్ణయాన్ని అధికారులు వెల్లడించారు.
ఇటీవల సీబీఎస్ఈ ఫలితాల వెల్లడికి ‘ఇంటర్నేషనల్ అసైన్‌మెంట్’ను తప్పనిసరి చేసింది. అయితే, తరగతులకు సరిగా హాజరుకాని విద్యార్థులు ఈ అసైన్‌మెంట్లను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బోర్డు గుర్తించింది.
ఈ నేపథ్యంలో, విద్యార్థులు అసైన్‌మెంట్లను సమర్థంగా పూర్తి చేయాలంటే వారికి తగినంత హాజరు శాతం ఉండటం అవసరమని భావించింది.
అందుకే, ప్రతి విద్యార్థికి 75 శాతం అటెండెన్స్ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సీబీఎస్ఈ తెలిపింది.
ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితం సీబీఎస్ఈ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించి కూడా ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. స్కూల్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతో పాటు ప్రాంగణంలోని అన్ని కీలక ప్రాంతాల్లో ఆడియో, వీడియో రికార్డ్ చేయగల కెమెరాలను అమర్చాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఈ కెమెరాల ఫుటేజ్‌ను కనీసం 15 రోజుల పాటు భద్రపరచాలని కూడా స్పష్టం చేసింది. విద్యార్థుల భద్రతను పటిష్ఠం చేయడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని బోర్డు వివరించింది.


బాబు ఫ్రంట్ జపంచేస్తే ఏపీలో టెంటే కూలిపోయింది: కిషన్ రెడ్డి