కరోనా కారణంగా ఏపీలో 2021 సంవత్సరం జరగాల్సిన ఓపెన్ స్కూల్స్ టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జులైలో బోర్డ్ పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన, నమోదుచేసుకున్న విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా చేస్తున్నట్లు ఏపీలోని పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీచేసింది. హైపవర్ కమిటీ సిఫార్సు మేరకు రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగా ఓపెన్ స్కూల్ విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీ ఓపెన్ స్కూల్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వివరాల మేరకు టెన్త్ విద్యార్థులకు గ్రేడ్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇంటర్ విద్యార్థులకు టెన్త్ మార్కులపై 30 శాతం వెయిటేజీ, సన్నద్ధతకు నిర్వహించిన పరీక్షల్లో మార్కులపై 70 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
previous post

