ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండే మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో గురువారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 10 పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో ఆరో తరగతికి 80 సీట్లు కేటాయించారు. వెబ్‌సైట్ల ద్వారా ఈ నెల 10 నుంచి ఫిబ్రవరి 11లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్ ఫీజు రుసుమును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.30 చెల్లించాలి.
ప్రవేశ పరీక్షకు అర్హత:
2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4, 5 తరగతులు విధిగా చదివి ఉండాలి. ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01–09–2007 నుంచి 31–08–2009 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01–09–2005 నుంచి 31–08–2009 మధ్య జన్మించి ఉండాలి.
మార్చి 31న ప్రవేశ పరీక్ష ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ఆయా మండలాల్లోని మోడల్ పాఠశాలల్లోనే నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11 వరకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. 5వ తరగతి సామర్థ్యాలకనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఇంగ్లీష్ పాఠ్యాంశాలకు సంబంధించి 25 మార్కుల చొప్పున ప్రశ్నలు ఉంటాయి.
జబర్దస్త్ తో గొప్పగా పేరు తెచ్చుకున్న రోజా.. రియల్ లైఫ్ లోనూ గొప్పగా నటిస్తోంది: నన్నపనేని