ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సైరా నరసింహారెడ్డి చిత్రం అదనపు షోలకు అనుమతిచ్చింది. అక్టోబర్ 2 నుంచి 8 తేదీ వరకు స్పెషల్ షోలకు అనుమతి ఇస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రతి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు స్పెషల్ షో లకు అనుమతిస్తున్నట్టు జీవోలో పేర్కొంది.
నటుడు చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ సైరాను నిర్మించారు.


ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే: పవన్ కళ్యాణ్