రేపటి నుంచి ఏపీ ఈ ఏపీసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ గురువారం (మే 16) నుంచి ప్రారంభం కానున్నాయి.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో పరీక్షలు జరగగా, ఇంజినీరింగ్ విభాగానికి మే 18 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3.61లక్షల మంది ఈఏపీ సెట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి గాను 2,73,010 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 87,419 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు. ఈ రెండు విభాగాల్లో కలిపి మొత్తం 1,211లక్షల మంది ఈఏపీ సెట్కు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ఈఏపీ సెట్ పరీక్షలకు మాత్రం మొత్తం 3,61,640 మంది హాజరు కానున్నారు.
ఈఏపీసెట్ నిర్వహణను ఏపీలో 47 కేంద్రాల్లో, హైదరాబాద్ ఎల్బీనగర్, సికింద్రాబాద్లోని రెండు సెంటర్లలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈఏపీసెట్ పరీక్షలను ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు కూడా విడుదలయ్యాయి. ఈ ఏపీసెట్ పరీక్షల నిర్వహణను ఈ ఏడాది జేఎన్టియూ కాకినాడ నిర్వహిస్తోంది.