telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

నివర్ తుఫాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

Mumbai cyclone

నివర్ తుఫాన్ బలపడుతోంది. గంటలకు 7 కిలోమీటర్ల వేగంతో తీరప్రాంత్రంపైపు దూసుకొస్తోంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయంలో 290 కి.మీ దూరంలో నివర్ తుఫాన్ ఉంది.  పుదుచ్చేరికి 300 కి.మీ, చెన్నైకి 350 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజాము వరకు కారైకల్-మామల్లపురం మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.  గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని,  గరిష్టంగా 145 కిలోమీటర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కర్ణాటక, తమిళనాడులో నేడు, రేపు భారీ వర్షాలు పడతాయని తెలిపారు.  బెంగళూరులో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నివర్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.  కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.  మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక జారీ చేశారు.  నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరులో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే  హుద్ హుద్, తిత్లీ, గజ, పెథాయ్, అమ్‌ఫున్, నిసర్గ, గతి, నివర్..తుఫాన్‌లకు ఈ పేర్లకు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు తుఫాన్‌లకు పేర్లు ఎందుకు పెడతారో తెలుసా ? 

తుఫాన్‌ లకు పేర్ల పెట్టకపోవడం వల్లే వాటి గురించి వార్తల్లో రాయాలన్నా, చర్చించాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఒకే సంవత్సరంలో రెండు మూడు తుఫాన్‌లు వస్తే మరింత గందరగోళం ఉంటుంది. తుఫాన్‌ల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే తుఫాన్‌లకు పేర్ల పెట్టాలని పలు దేశాలు నిర్ణయించాయి. 2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో హిందూ, బంగాళా ఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ పాల్గొని ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి. అలా మొత్తం 8 దేశాలు 8 పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను రూపొందించాయి. ఇంగ్లీష్ అక్షరాల ప్రకారం లిస్టులో బంగ్లాదేశ్ సూచించిన పేరు మొదటి స్థానంలో ఉంది. దాంతో 2004 అక్టోబరులో హిందూ మహాసముద్రంలో వచ్చిన తుఫాన్‌కు బంగ్లాదేశ్ సూచించిన ఒనిల్ పేరు పెట్టారు. అదే ఏడాది అరేబియా సముద్రంలో వచ్చిన తుఫాన్‌ కు భారత్ సూచించిన అగ్ని పేరు పెట్టారు. ఇక ఏపీని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుఫాన్‌కు పేరు పాకిస్తాన్ పెట్టింది. మొన్న వచ్చిన తిత్లీకి సైతం పాకిస్తానే నామకరణం చేసింది. ఐతే 8 దేశాలు సూచించిన 64 పేర్ల జాబితాలో ఇప్పటి వరకు 56 పేర్లను వాడేశారు. పెథాయ్ తుఫాన్ 56వ స్థానంలో ఉంది. మరో 8 తుఫాన్‌లు వస్తే ఆ జాబితాలోని పేర్లన్నీ పూర్తవుతాయి.

Related posts