ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంసెట్ షెడ్యూల్ ను ఇవాళ ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 24 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు. జూలై 25 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష ఫీజులను కూడా ఆయన వెల్లడించారు. అలాగే ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్ సెట్ లాంటి ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
next post
చిరంజీవితో సినిమా ఆగిపోవడానికి అసలైన కారణం… సీక్రెట్స్ వెల్లడించిన వర్మ