*ఏపీలో పదవతరగతి పరీక్ష ఫలితాలు విడుదల వాయిదా..
*సోమవారానికి వాయిదా వేసిన అధికారులు..
ఆంధప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు-2022 విడుదల వాయిదా పడింది. సోమవారానికి ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం 11గంటలకు ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 6 లక్షల 2 1వేల 799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది, 3 లక్షల 63 మంది బాలురు ఉన్నారు.
ప్యాకేజీలు తీసుకుని పవన్ చంద్రబాబుకు పనిచేస్తున్నారు: రోజా