telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘సీసీసీ మనకోసం’ ఛారిటీకి బిగ్ బీ సాయం… కృతజ్ఞతలు తెలిపిన చిరు

chiru

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మ‌న‌దేశంలో మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు సెల‌బ్రిటీలు త‌మ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తెలుగు సినీ కార్మికుల సహాయార్థం బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చారు. తన వంతుగా 12000 షాపింగ్ కూప‌న్స్‌ విరాళంగా అందించారు. ఒక్కో కూపన్ విలువ 1500 రూపాయ‌లు. అంటే మొత్తంగా దాదాపు 1.8 కోట్ల రూపాయల విలువైన కూపన్స్ ఇవి. వీటిని బిగ్ బజార్‌లో షాపింగ్ చేసేందుకు ఉపయోగించవచ్చు. ఈ మేరకు బిగ్ బీ చేసిన ఈ సాయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ కల్లోల సమయంలో తెలుగు సినీ కార్మికుల సహాయార్థం అమితాబ్ చేసిన ఈ సాయానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ కూపన్లను ఉపయోగించి సినీ కార్మికుల కోసం ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.  

Related posts