ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “మిషన్ మంగళ్”. ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. 2013లో భారత్ చేపట్టిన “మంగళ్‌యాన్” మిషన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జగన్ శక్తి తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ ఇందులో రాకేష్ పాత్ర పోషించగా, తాప్సీ, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో అద్భుతమైన కలెక్షన్స్‌ను రాబట్టుకుంటోంది. విడుదలైన తొలి రోజే రూ.29.16 కోట్లు వసూలు చేసి..అక్షయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో అక్షయ్ “కేసరి” రెండు వారాల కలెక్షన్స్‌ను ఒక్కవారంలోనే అధిగమించి మిగతా సినిమాలకు సైతం సవాల్ విసురుతోంది “మిషన్ మంగళ్”. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ బ్లాక్ బ్లస్టర్ మూవీ మొదటి ఆరు రోజుల్లోనే రూ. 114కోట్లు వసూలు చేసింది. వీకెండ్‌తో పాటు మిగితా రోజుల్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. మొదటి వారం కలెక్షన్లు 127కోట్ల వద్ద ముగుస్తుందని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాతో పాటు ఆగస్టు 15న విడుదలైన జన్ అబ్రహాం మూవీ బాట్లా హౌస్ రూ. 57కోట్లు వసూలు చేసింది.
previous post

