కార్తీ నటించిన ‘ఖైదీ’ గత ఏడాది దీపావళి కానుకగా తమిళ్, తెలుగులో రిలీజ్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిత్రంలో కార్తీ నటన, లోకేష్ కనకరాజ్ గ్రిప్పింగ్‌గా కథ చెప్పిన విధానం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ రిలీజ్ చేసారు. సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చెయ్యాలని ఎప్పుడో అనుకున్నారు. తాజాగా ఈ మూవీ బాలీవుడ్ రీమేక్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. హిందీలో చిత్రకథానాయకుడు ఎవరో రివీలైపోయింది. అజయ్ దేవగణ్ హీరోగా బాలీవుడ్లో ‘ఖైదీ’ చిత్రం తెరకెక్కనుంది. మాతృకకు దర్శకత్వం లోకేశ్ కనకరాజ్..రీమేక్‌కు కూడా డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు అజయ్. తెలుగులో ‘ఆర్.ఆర్.ఆర్’ యాక్ట్ చేస్తోన్న ఈ బాలీవుడ్ నటుడు.. హిందీలో ‘భుజ్: ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలో కనిపించబోతున్నాడు.
							previous post
						
						
					
							next post
						
						
					

