telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ హార్డ్ వర్క్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు

Ram

యంగ్ హీరో రామ్ ఇటీవల “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. రామ్, న‌భా న‌టేష్‌, నిధి అగ‌ర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “ఇస్మార్ట్ శంక‌ర్”. జులై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ 38 కోట్లకు పైగా షేర్ చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే.  ఈ చిత్ర విజ‌యం రామ్‌కి మంచి ఎనర్జీ ఇచ్చింది. అదే ఉత్సాహంతో త‌న 18వ సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వంలో రామ్ 18వ సినిమా రూపొందనుంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన నేను శైల‌జ‌, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ వంటి ప్రేమ క‌థా చిత్రాలు ప్రేక్ష‌కులను ఆకట్టుకున్నాయి. అయితే త‌న ప్ర‌తి సినిమా కోసం శ‌రీరాకృతిని మార్చుకుంటూ వ‌స్తున్న రామ్ తాజాగా త‌న 18వ సినిమా కోసం భారీ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. 1000 పౌండ్స్ ( దాదాపు 452 కిలోలు) బ‌రువుని కాలుతో లిఫ్ట్ చేస్తున్నాడు. ఈ ఫీట్‌కి సంబంధించిన వీడియోని రామ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా, ఇది చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు రామ్ అంకిత‌ భావానికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Related posts