telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పు డు ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉండేది: మాజీ సీఎం ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉమ్మడిగా ఉంటేనే బాగుండేదని.. తాను ఇప్పటికీ అదే కోరుకుం టున్నానని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పు డు ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉండేదని, కానీ  విభజన తర్వాత ఈ రెండు రా ష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడాలని వ్యా ఖ్యానించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమ హేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో బుధ వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘కలసి ఉంటే కలదు సుఖం. అందుకే తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగానే ఉండాలని కోరుకున్నాను.

అలా ఉంటేనే బాగుం డేది. ఇప్పటికీ నేను అదే మాటపై ఉన్నాను’ అని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, దాని వల్ల 7.2 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని, 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుందని చెప్పారు.

ఈ ప్రాజెక్టు కోసం తన హయాంలోనే టెండర్లు పిలిచానని గుర్తుచేశారు. కృష్ణా జలాలపై 1976 బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఏపీ వాడుకోవచ్చని చెప్పారు.

కానీ, ట్రైబ్యునల్‌ ఆర్డర్‌ను పునఃపరిశీలన చేయాలని తెలంగాణ అడుగుతోందని, దీనిపై మన ప్రభు త్వం కూడా స్పందించాలన్నారు.

తాను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడా నని నీరు ఉన్నప్పుడు ఫర్వాలేదు కానీ నీరు లే నప్పుడు సమస్య ఉత్పన్నమవుతుందని చె ప్పానని అన్నారు.

తెలుగు రాష్ర్టాల ముఖ్యమం త్రులు ఇద్దరూ కలసికట్టుగా ఆలోచన చేసి ఈ విషయంలో కోర్టులో గెలవడం ముఖ్యమని చె ప్పారు.

కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తోం దని, అయితే మరింత వేగం అవసరమని అన్నా రు. ప్రధాని మోదీ కూడా రాష్ర్టానికి సహకారం అందిస్తున్నారని, ఇది మరింత పెరగాలని చెప్పారు.

లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిని ఐక్యరాజసమితి సమావేశాలకు పంపడంపై కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ పార్లమెంట్‌ వేరు, కేంద్రం వేరని న్యాయశాస్త్రం ప్రకారం శిక్ష పడేవరకూ ఎవరినీ దోషి అనలేమని చెప్పారు.

సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్య క్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

Related posts