తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు సీఎం.
‘సన్నబియ్యంతో తెలంగాణ పల్లెల్లోని రేషన్ షాపుల వద్ద సందడి సంతరించుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసంపేదవాడి పదేళ్ల ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయి.
రాష్ట్రంలో 5.61 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు, 3.10 కోట్ల మందికి ఆహార భద్రత, ఒక్కొక్కరికి ఆరు కేజీల ఉచిత సన్నబియ్యం. ఇదీ పేదల సంక్షేమం పట్ల మా వజ్ర సంకల్పం.’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ఎవరెన్ని ఎంక్వయిరీలు చేసుకున్నా భయపడం: దేవినేని