టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. దేనికీ పనికిరాని కొందరు టీడీపీ నేతలు టీవీల ముందుకు వచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. దళితులకు ద్రోహం జరుగుతోందంటూ టీవీ చానళ్లు చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయని విమర్శించారు. వాస్తవానికి టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
ఓవైపు దళితులపై దాడులు చేయిస్తూ, ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ సన్నాసులకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవడం తప్ప లోకజ్ఞానం తెలియదని విమర్శించారు. చంద్రబాబు నిర్మాతగా రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు దర్శకత్వంలో ప్రతిరోజూ అద్భుతమైన సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.


కేటీఆర్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సీఎం కాలేడు: లక్ష్మణ్