యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా..’. ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయాలని నిర్మాత భావించారు. కానీ, కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడటంతో కుదరలేదు. యూత్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మంగళవారం ‘కృష్ణవేణి’ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ పాట లిరికల్ వీడియో ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ కుమార్ రాసిన ఈ తెలంగాణ యాసతో కూడిన సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్ అంతే జోష్‌తో ఆలపించారు. పాటలో జోష్ ఎలా ఉందో.. వీడియోలో హీరో జోష్ కూడా అదే స్థాయిలో ఉంది. బుజ్జిగాడు దుమ్ములేపుతున్నాడు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. కాగా, ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు నంద్యాల రవి మాటలు రాశారు.
previous post
next post