ఇటీవల నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో భార్య ఆలియా విడాకులు కావాలని లీగల్ నోటీసులు పంపింది. కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్, వాట్సాప్‌ల ద్వారా నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్ అభయ్ తెలిపారు. 2009లో నవాజుద్దీన్‌ని ఆలియా వివాహమాడగా, వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే తను విడాకులు ఇవ్వడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది ఆలియా. నాపై నవాజుద్ధీన్ ఎప్పుడు చేయి చేసుకోలేదు. కాకపోతే అతని అరుపులు, వాదనలు భరించలేనివిగా ఉంటాయి. ఇక ఆయన ఫ్యామిలీ అయితే నన్ను మానసికంగా, శారీరికంగా చాలా హింసించారు. సిద్ధిఖీ సోదరుడు నాపై చేయి కూడా చేసుకున్నాడు. అతని తల్లి, సోదరులు, వదిన అంతా ముంబైలోనే కలిసి ఉంటారు. నేను వాళ్ళతో చాన్నాళ్లు కలిసి జీవించాను. వారి టార్చర్ భరించలేకనే మొదటి భార్య కూడా వదిలి వెళ్ళిందని ఆలియా చెప్పుకొచ్చింది. నా పిల్లలకి తండ్రి ప్రేమ కూడా సరిగా తెలియదు. 4 నెలలకొకసారి పిల్లలని కలిసేవాడు. పెద్దగా పట్టించుకోడు. పిల్లలు కూడా ఆయనని పెద్దగా అడగరు అంటూ తన బాధలు చెప్పుకొచ్చింది. సెలబ్రిటీల విషయంలో ప్రేమ, పెళ్లి, విడాకులు సర్వసాధారణంగా మారింది.
previous post